Wed Jan 28 2026 03:58:01 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై...
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను సంస్థలకు ఇచ్చేందుకు అవసరమైన ఆమోదం నేటి మంత్రి వర్గ సమావేశంలో తెలపనున్నారు. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. అలాగే పలు సంక్షేమ పథకాల అమలుపై కూడా చంద్రబాబు మంత్రులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకోనున్నారు.
Next Story

