Thu Mar 05 2026 19:23:31 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : 13న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. అయితే మంత్రివర్గానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ అన్ని శాఖలకు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 11వ తేదీలోపు, ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు చేశారు.
కీలక అంశాలను...
ప్రధానంగా సీఆర్డీఏ ఆమోదం పొందిన నిర్ణయాలకు అనుమతి ఇస్తారు. అలాగే రాజధానితో పాటు విశాఖ ఇతర ప్రాంతాల్లో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు చేయనున్నారు. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అలాగే వివిధ పథకాలకు సంబంధించిన నిర్ణయాలను కూడా చర్చించి ఆమోదించనున్నారు.
Next Story

