Wed Mar 04 2026 11:02:15 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల విరామం అనంతరం తిరిగి నేడు ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటు శాసనమండలి సమావేశాలు నేడు ప్రారంభమై హాట్ హాట్ గా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ప్రారంభమయిన శాసనసభ తర్వాత జీరో అవర్, తర్వాత స్వల్ప కాలిక చర్చలు జరగనున్నాయి.
మండలిలో హాట్ హాట్ గా...
శాసనమండలిలో నేడు వైసీపీ సభ్యులు తిరుమల లడ్డూ అంశంపై చర్చించాలని, ఇందూపూర్ విషయంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయి. వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వనున్నాయి. మరొకవైపు తిరుమలలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై కూడా శాసనమండలిలో చర్చించే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Next Story

