Wed Dec 10 2025 08:18:44 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అమరావతి రియల్ ఎస్టేట్ ఢమాల్ అనిందా? రీజన్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో అమరావతి ప్రాంత రైతులకు సంబంధించిన భూముల విలువ ఢమాల్ అని పడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో అమరావతి ప్రాంత రైతులకు సంబంధించిన భూముల విలువ ఢమాల్ అని పడిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రాజధాని ప్రాంతంలో ఎకరం భూమి నలభై లక్ష రూపాయలు చేసే భూమి ఒక్కసారిగా ఎనభై లక్షల రూపాయల వరకూ పలికింది. రాజధాని ఇక్కడకు వస్తుందని తెలిసి అనేక మంది కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో రాజధాని ప్రాంతమే కాకుండా గుంటూరు జిల్లాలోని భూములకు కూడా ఒక్కసారి ధరలు పెరిగాయి. అక్కడకు కార్లలో అధిక సంఖ్యలో రియల్ వ్యాపారులు వచ్చి భూములుబేరాలు ఆడి కొనేవారు. కానీ నేడు బేరమాడే వారు కూడా లేరు.అయితే 2019 ఎన్నికలలో జగన్ వచ్చి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన వెంటనే తిరిగి ఎకరం భూమి నలభై లక్షల రూపాయలకు చేరింది.
ఒక్కసారిగా పడిపోయిన ధరలు...
దీంతో ఈ ప్రాంత వాసులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి ఎన్నికయ్యేందుకు దోహదపడ్డారు. వారి ఆందోళనలు ఒకరకంగా పార్టీకి అనుకూలంగా మారాయి. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత అనుసరిస్తున్న పద్ధతులు, వరసగా భూ సమీకరణలు చేస్తుండటంతో మళ్లీ రియల్ ఎస్టేట్ స్తబ్దత నెలకొనిందంటున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు రియల్ వ్యాపారులు ఇక్కడకు వచ్చి భూములు కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. కొందరు అపార్ట్ మెంట్లు నిర్మించారు. నేడు అపార్ట్ మెంట్ల ధరలు కూడా గతంలో మాదిరిగా లేవంటున్నారు. గతంలో అమరావతి రాజధాని హైప్ చూసి భూమిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు అమ్మాలన్నా కొనేవారు లేరని వాపోతున్నారు.
రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాకున్నా...
అమరావతిలో తొలి విడత ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన భూములు ఇంత వరకూ అభివృద్ధి చేయకుండా రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం వెళ్లడం, మూడో విడత కూడా ఉందనిచెప్పడంతో భూముల ధరలు ఢమాల్ అంటున్నాయట. ఇందుకు అమరావతికి చెందిన ఒక రైతు ఉదాహరణ చెప్పారు. ఎక్కడైనా ఒక వీధిలో ఒక షాపు ఉంటే దానికి గిరాకీ ఉంటుంది. అదే వీధిలో మరొక షాపు ఏర్పాటయితే గిరాకీ తగ్గిపోతుంది. ఇప్పుడు రెండోసారి భూ సమీకరణ విషయంలో తాము కూడా ఇలాగే అన్యాయానికి గురవుతున్నామని చెబుతున్నారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదంటూనే తమకు ప్లాట్లను అభివృద్ఇ చేయకుండానే మరొకరికి ప్లాట్లు కేటాయించడంతో భూముల ధరలు తగ్గిపోయాయని, జేఏసీ నేతలతో మాట్లాడి ఫలితం లేదని, గ్రామ సభలు జరిపి రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించాలి కదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Next Story

