Tue Mar 31 2026 12:04:13 GMT+0530 (India Standard Time)
Amaravathi : రాజధానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చే అవకాశం లేదా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించలేదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించలేదు. నూతన రాజధాని అమరావతికి ఎనభై కేంద్ర ప్రభుత్వం సంస్థలు రావాల్సి ఉంది. వాటికి గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం భూములను కేటాయించింది. భూములు కేటాయించి దాదాపు తొమ్మిదేళ్లవుతున్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రం ఇప్పటి వరకూ అమరావతిలో నిర్మాణానికి నడుంబిగించలేదు. ఇప్పటి వరకూ ఒక్క దానికి కూడా శంకుస్థాపన చేయ లేదు అమరావతికి చట్టబద్ధత అవుతుందని దగ్గర రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు అది కార్యరూపం దాల్చలేదు.
విభజన జరిగి పదేళ్లవుతున్నా...
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతుంది. నూతన రాజధాని ప్రకటించి దాదాపు తొమ్మిదేళ్లవుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధాని ప్రాంతంలో తమ సంస్థల నిర్మాణానికి ఆసక్తి చూపకపోవడానికి కారణాలపై స్థానిక రైతుల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర సంస్థలు అమరావతిలో నెలకల్పటానికి ఇబ్బంది ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో భాగస్వామ్యులుగా ఉండి కూడా కనీసం కేంద్ర ప్రభుత్వసంస్థలను అమరావతికి రప్పించకపోవడంపై ఇక్కడ రైతాంగం పెదవి విరుస్తుంది.
రైతుల సమస్యలు అలాగే...
ఇక తమ సమస్యలు అలాగే ఉన్నాయని రైతులు వాపోతున్నారు. కమర్షియల్ ఎఫ్ ఎస్ ఐ పెంచమని రైతులు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. వాళ్లను పట్టించుకున్న వాళ్ళు లేరు. రాజధానిలో రోడ్ల నిర్మాణాలు పూర్తి కావాలంటే భూ సమీకరణ జరగాలని మంత్రి నారాయణ చెబుతున్నారు. రైతులు అంగీకరించకపోతే భూమిని సమీకరిస్తామని అంటున్నారు. రైతులుమాత్రంతమ భూములను రహదారి నిర్మాణం కోసం తీసుకుంటే జాతీయ రహదారుల భూసేకరణ చట్టం రాజధాని లో కూడా అమలు అయ్యేటట్టు పార్లమెంట్లో చట్టం తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమకు పరిహారం అరకొరగా అందుతుందనిఅంటున్నారు.మొత్తం మీద రాజధాని అమరావతిలో రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.
Next Story

