Tue Apr 07 2026 12:40:31 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రాజధానిలో భూ కేటాయింపులపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది. మున్సిపల్ మంత్రి నారాయణ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30కి సచివాలయంలో సమావేశం కానున్న కేబినెట్ సబ్ కమిటీ పలు భూ కేటాయింపులపై చర్చించనుంది. అమరావతిలో నిర్మించే సెక్రటేరియట్,హెచ్ ఓడీ ఆఫీసులకు అవసరమైన స్థలం కేటాయించడంపై చర్చిస్తారు.
ఒకే చోట అన్ని విభాగాలు...
ఈ సమావేశానికి మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్,బీసీ జనార్ధన రెడ్డి,సత్య కుమార్,నాదెండ్ల మనోహర్,డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరుకానున్నారు. ఒకే చోట సెక్రటేరియట్ విభాగాలతో పాటు హెచ్ ఓడీ విభాగాలు ఏర్పాటుచేసేలా ఐకానిక్ భవనాలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాఖల వారీగా అవసరమైన స్థలం వివరాలు తీసుకొని కేటాయింపులపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
Next Story

