Thu Feb 12 2026 15:02:17 GMT+0530 (India Standard Time)
నిన్నటి సంఘటన నన్ను బాధించింది
నేడు రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

నేడు రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమయింది. ప్రశ్నోత్తరాలు అనంతరం జరిగిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకోవడం, కాగితాలు చించిపడేయటం తనను బాధించిందని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇటువంటి సంప్రదాయం మంచి పద్ధతి కాదని స్పీకర్ అన్నారు.
గవర్నర్ స్పీచ్ ను అడ్డుకోవడం...
విద్యార్థులు ఈ అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఏమి నేర్చుకుంటారని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. భావి తరాలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని ఆయన అన్నారు. తనను ఈ సంఘటనను బాధించిందని, ఈ విషయంపై అందరూ సభ్యులు ఆలోచించాలని, ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా అందరం కలసి కట్టుగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Next Story

