Fri Feb 20 2026 16:42:23 GMT+0530 (India Standard Time)
వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతారా?
వైసీపీ నేతలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు

వైసీపీ నేతలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులుగా ప్రదర్శిస్తూ వైసీపీ సభ్యులు ర్యాలీగా వచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజకీయాల్లో ఎంత దూరమైనా వెళ్లొచ్చు కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని అన్నారు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే చర్య కాక మరేంటని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
గత రెండు నెలలుగా...
గత రెండు నెలలుగా వెంకటేశ్వరస్వామిని రాజకీయంగా వాడుకుంటున్నారని, అయినా తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని, ప్రతి రోజూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ ఘటనతో వైసీపీ నేతలకు, జగన్ కు దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉందో తెలుస్తోందన్నారు. ప్రతిరోజూ సభలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తున్నారన్న పయ్యావుల శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరు హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయని అన్నారు.
Next Story

