Sun Mar 22 2026 08:56:16 GMT+0530 (India Standard Time)
నేడు చంద్రబాబుతో పవన్ భేటీ
ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తో స డిప్యూటీ సీఎం పవన్ మావేశం కానున్నారు

ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తో స డిప్యూటీ సీఎం పవన్ మావేశం కానున్నారు. ఉండవల్లి లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉదయం 10.40 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల ఎంపిక, ఇతర కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలిసింది.
రాజ్యసభ స్థానాల విషయంలో...
త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో కూటమి పార్టీలకు సంబంధించిన షేరింగ్ పై చర్చించే అవకాశముంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించే ఛాన్స్ ఉంది. మరొకవైపు తిరుమల లడ్డూ వివాదంపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఉదయం హైదరాబాద్ నివాసం నుంచి విజయవాడ రానున్న పవన్ కళ్యాణ్ అనంతరం ఉండవల్లికి చేరుకుని చంద్రబాబుతో భేటీ అవుతారు.
Next Story

