Wed Dec 31 2025 04:44:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో కొత్త జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. జిల్లా కేంద్రాలుగా మార్కాపురం, రంపచోడవరం ఉంటాయి. ఈ రెండు కొత్త జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు నుంచి ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరాయి.
అధికారుల నియామకం...
పోలవరం జిల్లాకు ఇన్ఛార్జి కలెక్టర్గా ఎ.ఎస్.దినేశ్ కుమార్, ఇన్ఛార్జి ఎస్పీగా అమిత్ బర్దర్, ఇన్ఛార్జి జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా పి.రాజాబాబు, ఇన్ఛార్జి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జి జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story

