Sun Jan 11 2026 02:12:53 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జల వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్
అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు

అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఉండవల్లి లో సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద మీడియా తో మంత్రి నారాయణ మాట్లాడారు. వైసీపీ దృష్టిలో రాష్ట్ర రాజధాని ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అని తమకు పూర్తి క్లారిటీ ఉందన్న మంత్రి నారాయణ తమాలాగే వైసీపీ కూడా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కి తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ అన్నారు.
రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటో?
రైతులతో మాట్లాడటానికి ఇష్టపడని నాయకులు ఇప్పుడు లేనిపోని ప్రేమ చూపిస్తారన్న మంత్రి నారాయణ గత ప్రభుత్వం నిర్వాకంతోనేనే అమరావతి పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయన్నారు. అమరావతి నిర్మాణ పనులకు పారదర్శకంగా టెండర్లు పిలిచామని, రాజధానిపై బురద జల్లే ఉద్దేశంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ లో కేవలం మంత్రులు,వారి శాఖలు,అధికారులు మాత్రమే ఉండేలా నిర్మించారని, అమరావతిలో నిర్మించే సెక్రటేరియట్ లో మంత్రులు,సిబ్బంది, హెచ్.ఓ.డీ లు,ఇతర కార్పొరేషన్లు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలకు పాలన దగ్గరగా ఉండేవిధంగా అన్ని నిర్మాణాలు చేస్తున్నామని తెలిపారు.
Next Story

