Thu Feb 19 2026 14:57:34 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే డీఎస్సీని ప్రకటి్తామని తెలిపారు. సభలో ప్రశ్నకు సమాధానమిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదలలో భాగంగా త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీని నిర్వహించిన తమ ప్రభుత్వం మరొక డీఎస్సీ కూడా నిర్వహిస్తుందని చెప్పారు.
త్వరలోనే మరో డీఎస్సీ...
త్వరలోనే టీచర్ల భర్తీ కోసం మరో డీఎస్సీ నిర్వహిస్తామన్న నారా లోకేశ్ టీచర్- స్టూడెంట్ రేషియో కర్నూలుతో పాటు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తక్కువగా ఉందని చెప్పారు. త్వరలోనే భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి లోకేశ్ సభలో ప్రకటించారు. అయితే ఎన్ని పోస్టులకు నిర్వహించాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Next Story

