Thu Mar 19 2026 09:47:15 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఇన్ ఛార్జులుగా సీనియర్ ఐఏఎస్ ల నియామకం
ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాలకు సీనియన్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్‌ఛార్జులుగా నియమించింది

ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాలకు సీనియన్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్‌ఛార్జులుగా నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు పాటించాల్సిన విధానాలను అమలు చేయడం, ఇంటర్ డిపార్ట్మెంట్స్ కో - ఆర్డినేషన్ కోసం పని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదు జిల్లాలకు...
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు జి.వీరపాండియన్, కాకినాడ జిల్లాకు ప్రసన్న వెంకటేశ్, బాపట్ల జిల్లాకు మల్లికార్జున్, శ్రీసత్యసాయి జిల్లాకు గంధం చంద్రుడు, నంద్యాల జిల్లాకు సి.హెచ్.శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.వీరు అధికారులను సమన్వయం చేసుకుని వెళ్లారని తెలిపారు.
Next Story

