Fri Dec 05 2025 11:10:39 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : విజయవాడలో నేడు దుకాణాలు బంద్..ఇళ్లలో నుంచి బయటకు రాకండి
మొంథా తుపాను తీవ్రత దృష్ట్యా విజయవాడ ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక సూచనలు చేశారు

మొంథా తుపాను తీవ్రత దృష్ట్యా విజయవాడ ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక సూచనలు చేశారు. నేడు విజయవాడలో దుకాణాలు మూసేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొంథా తుపాను నేపథ్యంలో రేపు విజయవాడలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ తో జిల్లా కలెక్టర్ అప్రమత్తమై ఈ సూచనలు చేశారు. విజయవాడలో నేడు 16 సెం.మీ వర్షపాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన మున్సిపల్ అ అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అత్యవసరమైతే తప్ప...
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, పాల విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ : 9154970454 వీఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు : 0866 2424172, 0866 2422515 మెడికల్, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
విద్యాసంస్థలు మూసివేయాలి...
అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజయవాడ కలెక్టర్ సూచించారు. మొంథ తుఫాను ప్రభావం నేడు జిల్లాలో చాలా ఎక్కువుగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికలతో ఈ సూచనలు చేశారు.*విజయవాడ నగరంలో సుమారు 162 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు తప్పని సరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, పిల్లలు, వృద్దులను ఇంట్లోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. చెట్ల కింద, హోర్డింగ్ లుకింద, పాత భవనాల్లో ఎవరూ ఉండకండని తెలిపారు. మూడు రోజులపాటు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలకు సెలవు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story

