Sat Mar 28 2026 17:54:48 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం పదకొండు గంటలకు తన నివాసంలో జనసేన, బీజేపీ చీఫ్ లు పవన్ కల్యాణ్, మాధవ్ లతో భేటీ అవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. లడ్డూ వివాదంలో నెలకొన్న పరిస్థితులపై ప్రచారాన్ని ఏ రకంగా చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు.
సమీక్షలు.. సమావేశాలు...
చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు వెలగపూడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు సాగునీటి సంఘాల సమావేశంలో పాల్గొంటారు. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణ, నీటిని వృధా చేయకుండా ఎలా వినియోగించుకోవాలో వారికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5.50 గంటలకు చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం చంద్రబాబు తన నివాసంలో6.10 గంటలకు కార్మిక శాఖపై సమీక్ష చేస్తారు
Next Story

