Thu Jan 08 2026 06:52:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ సమావేశలో పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయానికి రానున్నారు. 11.30 గంటలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీయే అథారిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల అంశంపై సమీక్ష నిర్వహిస్తారు. వారికి పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలపై అధికారులను దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5.45 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
భూముల కేటాయింపులో...
ఈరోజు చంద్రబాబు నేతృత్వంలో ఎస్ఐపీబీ సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. సంబంధిత అధికారులు, మంత్రులు హాజరుకానున్నారు. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. రాజధానిలో పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. రేపటి నుంచి ఏడు గ్రామాల్లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న క్రమంలో నేడు సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

