Fri Apr 03 2026 20:16:11 GMT+0530 (India Standard Time)
పార్టీకి వివరణ ఇచ్చిన అరవిందబాబు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు వివరణ ఇచ్చారు

పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ నియామకంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు వివరణ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పరిస్థితులను పల్లాకు వివరించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించానని అరవింద్‌బాబు వివరణ ఇచ్చారు.
చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని...
ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అరవింద్‌బాబుకు వివరించారు. అదే విధంగా ఇలాంటి చర్యలను పార్టీ ఉపేక్షించదని సీఎం చంద్రబాబు మాటగా పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలను చంద్రబాబు ఉపేక్షించరని పల్లా వివరించారు. ఇలాంటివి పునరావృతం కాకూడదన్నది చంద్రబాబు మాటగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబుకు పల్లా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు.
Next Story

