Fri Mar 13 2026 01:11:04 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికలు
నేడు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

నేడు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఇప్పటికే ప్రారంభమయింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. సచివాలయం ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో అనేక మంది పోటీ పడుతున్నారు.
సాయంత్రం కౌంటింగ్...
మొత్తం తొమ్మిది కేటగిరీల్లో అభ్యర్థులు పోటీకి దిగారు. పోటీకి దిగిన అభ్యర్థులు గత కొంతకాలంగా ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఉద్యోగులకు హామీలను కూడా గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘంలో 1,160 మంది ఓటర్లున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

