Sat Jan 03 2026 15:09:36 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వఉద్యోగులకు వైద్య బిల్లుల చెల్లింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులు తమ వైద్యం కోసం ఖర్చుచేసే బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు నెల వరకూ ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లులన్నీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
బిల్లులు క్లియర్ చేస్తూ...
మెడికల్ రీఎంబర్స్ మెంట్ బిల్లులను క్లియర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధులను విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల ఇటీవల చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోదినేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్ లైన్ సులభంగా చేసుకోవచ్చని కూడా తెలిపింది.
Next Story

