Thu Feb 26 2026 12:49:32 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు శాసనసభలో రెండు కీలక బిల్లులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. నేడు శాసనసభలో రెండు బిల్లులు ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రవేశ పెట్టనున్నారు.
గ్రామ వార్డులకు..
గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టనున్నారు. సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేలా బిల్లు కూడా శాసనసభ ఆమోదం పొందనుంది. జలవనరుల శాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టనున్నారు.
Next Story

