Tue Aug 09 2022 23:11:49 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా పడిపోయిన టమాటా ధర.. కిలో ఎంతంటే?

టమాటా రైతులకు కష్టాలు మొదలయ్యయి. పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. కనీసం రవాణా ఛార్జీలు కూడా దక్కడం లేదు. నెల రోజుల క్రితం వరకూ టమాటా ధర దిగిరాలేదు. కిలో వంద రూపాయల వరకూ పలికింది. మదనపల్లి, కర్నూలు వంటి మార్కెట్ లో టమాటా చిక్కడం నాడు కష్టమయిపోయింది. దీంతో రైతులంతా టమాటా పంటను వేశారు. దిగుబడి పెరిగింది. ఫలితంగా టమాటా ధర భారీగా పడిపోయింది.
రోడ్డుపై పోసి.....
ప్రస్తుతం కిలో టమాటా ధర మార్కెట్ యార్డుల్లో నాలుగు రూపాయలే పలుకుతుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా, రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు భైంసా మార్కెట్ లో టమాటా రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై టమాటాలు పారబోసి ఆందోళనకు దిగారు. కనీసం రవాణా ఛార్జిలు కూడా రావడం లేదని టమాటా రైతులు వాపోతున్నారు.
Next Story