Thu Mar 19 2026 19:39:57 GMT+0530 (India Standard Time)
రికార్డు స్థాయిలో పత్తి ధర
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో పత్తి క్వింటాల్ కు 11,170 ధర లభించింది.

తెలంగాణలో వాణిజ్య పంటలకు మంచి ధర లభిస్తుంది. మార్కెట్ యార్డుల్లోనే మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. నేడు పత్తికి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలకడంతో రైతులు తమ పంటను విక్రయించేందుకు క్యూ కడుతున్నారు.
క్వింటాల్ కు....
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో పత్తి క్వింటాల్ కు 11,170 ధర లభించింది. మంచి ధర లభించిందని రైతులు కూడా చెబుతున్నారు. రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఇక తెలంగాణ రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story

