Sat Dec 13 2025 22:43:26 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు ఖరీఫ్ వేళ తీపి కబురు చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. పథ్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. పథ్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు మీడియాకు వివరాలను వెల్లడించారు. వరి క్వింటాల్‌కు రూ.69 పెంచారు. జొన్నలు రూ.328, సజ్జలు రూ.150 పెంపుదల చేశారు.రాగులు రూ.596, వేరుశెనగ రూ.480 పెంచారు. మొక్కజొన్న రూ.175, కందిపప్పు రూ.450 పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2.70 లక్షల కోట్లు...
పెసర్లు రూ.86, మినుములు రూ.400 పెంచారు.పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుములు రూ.579, ఒలిసెలు రూ.820 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంచిన కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కోసం రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరించారు.
Next Story

