Sat Dec 07 2024 14:55:12 GMT+0000 (Coordinated Universal Time)
Crop Insurance : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే?
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం కేంద్రం కల్పించనుంది
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం కేంద్రం కల్పించనుంది. రైతులు తమ పంటపోలాలకు బీమా ప్రీమియం కట్టుకోవటానికి కామన్ మ్యాన్ సర్వీస్ సెంటర లో రబీ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ లాగిన్ ఓపెన్ అయింది. అందువల్ల రైతులు అందరూ కూడా తమ పంట పొలాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుతున్నారు. ఈ పంట బీమాకు అవసరమైన డాక్యుమెంట్లను కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పత్రాలను తీసుకెళితే ప్రీమియం చెల్లించే అవకాశాలున్నాయి.
కావాల్సిన పత్రాలు...
1 ఆధార్ కార్డ్
2 పొలం పాస్ బుక్ జిరాక్స్
3 బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
4 రైతు సేవ కేంద్రంలో ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
5 రైతు ఫోన్ నెంబర్
చివరి తేదీ...
ఈ పత్రాలతో దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో కాని సీఎస్ఈ సెంటర్ లో గాని రైతు సోదరులు వెళ్లి పంటలకు బీమా చేయించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కౌలు రైతులకు కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కి అర్హులని తెలిపింది. అయితే కౌలు రైతు కార్డు తప్పనిసరి గా వుండాలని తెలిపింది. ప్రాంతాలను బట్టి వరి, మొక్కజొన్న,శనగ, జొన్న, పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పంటలకు బీమ చేసేందుకు చివరి తేదీ వచ్చే నెల పదిహేనోతేదీగా నిర్ణయించారరు. వరి పంటకు మాత్రం చివరి తేదీ డిసెంబరు 31వ తేదీగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరింది.
Next Story