Sat Jan 31 2026 21:35:06 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో రైతన్నా మీకోసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతులకోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతులకోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. రైతన్నా.. మీ కోసం అనే కార్యక్రమం ద్వారా రైతులను చైతన్యవంతుల్ని చేయాలని నిర్ణయించింది. వ్యవసాయంలో పాటించాల్సిన మెళుకువలను, తద్వారా అన్నదాతలకు కలిగే ప్రయోజనాలను వివరించనుంది. రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా అవగాహన కల్పించే కార్యక్రమం మొదలవుతుంది.
24వ తేదీ నుంచి...
రైతుల ఇళ్లకు ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ ప్రజాప్రతినిధులు వెళ్లి వారికి సాగులోఅనుసరించాల్సిన పద్ధతులను గురించి వివరించనున్నారు. పంటల ఎంపిక దగ్గర నుంచి, వాటిని అమ్ముకునే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరిస్తారు. లాభదాయకమైన పంటలను ఎంపిక చేసుకున్నందున నష్టాల బాట పట్టకుండా అన్నదాతలు ఇబ్బంది పడకుండా ఉంటారని ప్రభుత్వం భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
Next Story

