Fri Dec 05 2025 14:56:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మొంథా తుపాను.. రైతులను నిలువునా ముంచేసింది
ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు

ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండానే నాశనమయిపోయింది. 243 మండలాల్లో తీవ్ర పంటన నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంట నేలవాలింది. అరటి, బత్తాయి వంటి తోటలు పూర్తిగా ఈదురుగాలులకు ధ్వంసమయ్యాయి. మిరప, పత్తి రైతులు నష్టపోయి కూడా ఆందోళన చెందుతున్నారు. కంది, అరటి, బొప్పాయి, వేరుశెనగ వంటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 22 రెండు జిల్లాల్లో మొంథా తుపానుతో భారీగా పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు.
వరి రైతులు...
వరి సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. భారీ వర్షాలకు, ఈదురుగాలులకు వరిపంట దెబ్బతినింది. డెల్టా ప్రాంతంలో సాగవుతున్న వరి నేలకొరిగింది. వరి ప్రస్తుతం కంకుల దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తున్న దశలో భారీ వర్షం, గాలులకు పంట దెబ్బతినింది. మరో పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటున్న దశలో నష్టం వాటిల్లినట్లు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటపై ఆశలు వదులుకోనున్నారు. వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఇక కోలుకోలేని పరిస్థితి నెలకొంది. పంట నష్టాన్ని అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. పెట్టుబడి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు.
అనేక పంటలు దెబ్బతినడంతో...
వర్షపు నీరు పొలాల్లోకి చేరడంతో పంట పూర్తిగా నాశనయినట్లేనని అన్నదాతలు విలపిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎకరాకు ముప్ఫయి నుంచి నలభై వేల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరటి, కంది, బొప్పాయి, బత్తాయి వంటి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు కోలుకోవడం కష్టమేనని అనిపిస్తుంది. ప్రభుత్వం పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించింది. అయినా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం వీరి నష్టాన్ని ఏమాత్రం పూడ్చలేదన్నది మాత్రం వాస్తవం.
Next Story

