Mon Apr 21 2025 17:41:02 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
polling for the second phase of the jammu and kashmir elections has ended. 54 percent voting was recorded till five o'clock in the evening

జమ్మూ కాశ్మీర్ లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ ఓటింగ్ 54 శాతం నమోదయిందని ఎన్నికల అధికారులు చెబతున్నారు. ఈరోజు ఐదు జిల్లాాల్లోని 26 అసెంబ్ల ీనియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడత ఎన్నికలో 239 మంది అభ్యర్థులు 26 నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమయింది.
పోలింగ్ శాతం...?
అయితే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఉదయం ఏడు గంటలకే ఓటర్లు చేరుకోవడంతో అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతుందని భావించారు. మొదటి దశ ఎన్నికల్లోనూ 60 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అక్టోబర్ 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో మొత్తం నలభై స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 8వ తేదీన జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story