Thu Mar 19 2026 04:30:10 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు ఐపీఎల్ రెండు మ్యాచ్లు.. హేమాహేమీలు
నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించేవే

నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించేవే. రెండు జట్లు బలమైనవే. శని, ఆదివారాలు రెండేసి మ్యాచ్ లను యాజమాన్యం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. రాత్రి 7.30 గంటలకు ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది.
రెండు మ్యాచ్ లు...
జైపూర్ లో జరగనున్న తొలి మ్యాచ్ లో రాహుల్ వర్సెస్ సంజూ శాంసన్ మధ్య పోరు జరగనుంది. కేఎల్ రాహుల్ చాలా రోజుల తర్వాత గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ లో కనిపించనున్నాడు. ఇరుజట్లలో వేటిని తీసిపారేయడానికి లేదు. గత ఏడాది ఇక్కడే జరిగిన మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది. ఈసారి ప్రతీకారాన్ని తీర్చుకోవాలన్న లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ ఉంది. అదే సమయంలో ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా వహిస్తున్నాడు. దానికి, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తాను మొన్నటి వరకూ కెప్టెన్సీ బాధ్యతలను వహించిన జట్టుతోనే పాండ్యా తొలి పోరుకు సిద్ధమయ్యాడు.
Next Story

