Wed Dec 17 2025 12:50:04 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు మరో క్రూషియల్ మ్యాచ్
ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది

ఐపీఎల్ లో మ్యాచ్ లు చివరికి వచ్చే సరికి ఉత్కంఠగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు లేవన్న జట్లు పుంజుకుంటున్నాయి. అప్రహతిహంగా ఈ సీజన్ లో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ కాపిటల్స్ ఓడించడమే ఇందుకు నిదర్శనం. ప్లే ఆఫ్ చేరుకునే ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు ప్రతి జట్టు పోరాడుతుంది. అందుకే ఈసారి ఏ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయన్నది చెప్పడం కష్టం. ఇప్పటికే ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ నుంచి తప్పుకోగా, మిగిలిన జట్లు మాత్రం శ్రమిస్తున్నాయి.
హైదరాబాద్ లో...
ఈరోజు మరో ముఖ్యమైన మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. హైదరాబాద్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు జరిగే మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు అలరించనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

