Thu Dec 18 2025 07:37:08 GMT+0000 (Coordinated Universal Time)
lPL 2024 : నేడు డబుల్ బొనాంజా.. అదిరిపోయే మ్యాచ్ లు
నేడు గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు తలపడుతుంది సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది

నేడు కూడా ఐపీఎల్ లో రెండు అదిరిపోయే మ్యాచ్లు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు జట్టు తలపడుతుంది. ప్లే ఆఫ్ కోసం రెండు జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. చావో రేవో అన్నట్టుగా ఉంది ఈ రెండు జట్ల పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ సన్ రైజర్స్ మీద గెలిచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కొంత ఊపులో ఉంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ వరస ఓటములతో ఇబ్బంది పడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోనున్నారు. మధ్యాహ్నం 3.3ం గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ప్లే ఆఫ్ ఆశలు...
మరో మ్యాచ్ కూడా కీలకమే. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రెండు జట్లు పోరాడుతున్నాయి. రెండు జట్లు మంచి ఊపు మీదున్నాయి. హైదరాబాద్ జట్టు అటు బ్యాటింగ్ లో సత్తా చాటుతుంది. రికార్డులను సృష్టిస్తుంది. మరోవైపు ప్లే ఆఫ్ లో ఆశలు నిలుపుకోవాలనుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని ఎగబాకేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగనుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
Next Story

