Thu Mar 19 2026 10:45:49 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు ఐపీఎల్ లో మరో అద్భుతమైన మ్యాచ్
ఈరోజు కూడా అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ఐపీఎల్ నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది

ఈరోజు కూడా అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ఐపీఎల్ నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్లతో నిన్నటి మ్యాచ్ లో ఓటమి పాలయిన సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. సీజన్ ప్రారంభం నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తుంది. అయితే తర్వాత కొంత ఇబ్బంది పడుతుంది. వరస వైఫల్యాలు దానిని ఇబ్బంది పెడుతున్నాయి.
పడి లేచి...
మరొకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం సీజన్ ప్రారంభంలో అన్ని మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అస్సలు ప్లే ఆఫ్ కు చేరుకుంటుందా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ బెంగళూరు జట్టు ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది. వరస విజయాలతో ప్లే ఆఫ్ లోకి దూసుకు వచ్చింది. ఆరు విజయాలను సొంతం చేసుకున్న ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడుతుంది. దీంతో ఈరోజు రెండు జట్లు ఢీ అంటే ఢీ అనేలా తలపడనున్నాయి.
Next Story

