Fri Dec 05 2025 22:47:17 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు ముంబయికి మరో సవాల్
ముంబయి ఇండియన్స్ నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది

ముంబయి ఇండియన్స్ నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆ జట్టు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముంబయిలో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ముంబయి ఇండియన్స్ కసితో ఉంది. ఇప్పటికే వరస ఓటములతో జట్టు ఒకింత కుంగిపోయి ఉంది. జట్టులో జోష్ పెరగడానికి ఖచ్చితంగా ఇక్కడ గెలవడం అవసరం. హోంపించ్ కావడంతో తమకు అడ్వాంటేజీ ఉందని ముంబయి ఇండియన్స్ టీం భావిస్తుంది.
బలంగా రాయల్స్...
మరో వైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా బలంగా ఉంది. ఈ ఐపీఎల్ లో ఈ జట్టు ఇప్పటికే పాయింట్స్ ను సాధించింది. అందుకే రాయల్స్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. మరో వైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీని మార్చిన తర్వాత వరస ఓటములు ఆజట్టు యజమాన్యానికి కూడా తలనొప్పిగా మారాయి. ఈరోజు ముంబయి ఇండియన్స్ గెలిస్తేనే కొంత ఫ్యాన్స్ నుంచి వత్తిడి తగ్గుతుంది. లేకుంటే కెప్టెన్సీని మార్చాలన్న వత్తిడి మరింత పెరిగే అవకాశముంది.
Next Story

