Sun Mar 15 2026 22:10:19 GMT+0530 (India Standard Time)
IPL 2024 : సమ ఉజ్జీల పోరు నేడు
ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది.

నేడు ఐపీఎల్ లో సమఉజ్జీల మధ్య పోరు జరగనుంది. ఐపీఎల్ లో అంచనాలకు తగినట్లు విజయాలు దక్కడం లేదు. ఊహించని జట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఎంతో హోప్స్ పెట్టుకున్న జట్లు మాత్రం చతికలపడుతున్నాయి. అందరి అంచనాలు వేరుగా ఉంటున్నాయి. మైదానంలో జరిగే పరిస్థితులు మరో రూపంలో ఉంటున్నాయి. ఫలితాలు వచ్చేంత వరకూ ఎవరిది విజయం అన్నది మాత్రం తేలకుండా పోతుంది. అందుకే ఐపీఎల్ లో ఎవరు ప్లేఆఫ్ కు చేరుకుంటారన్నది ముందుగా అంచనా వేయడం కష్టమే.
నేడు జరిగే...
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది. రెండు జట్లు పెద్దగా ఈ సీజన్ లో రాణించడం లేదు. ముంబయి ఇండియన్స్ తో పోల్చుకుంటే లక్నో జట్టు ఒకింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరిది ఈరోజు గెలుపు అన్నది మాత్రం ముందుగా అంచనా వేయలేని పరిస్థితి. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

