Sun Mar 15 2026 20:35:33 GMT+0530 (India Standard Time)
IPL 2024 : హైదరాబాద్ లో మ్యాచ్ నేడు జరుగుతుందా? వెదర్ రిపోర్టు మాత్రం?
సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ మరికాసేపట్లో జరగబోతుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ మరికాసేపట్లో జరగబోతుంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అందుకు సహకరిస్తుందా? అన్న అనుమానం బయలుదేరింది. మరో గంటలో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లు సూచనలు అందుతున్నాయి. నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది.
రెండు జట్లు...
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? అన్న అనుమానం మాత్రం అందరిలోనూ ఉంది. మ్యాచ్ ప్రారంభమయిన తర్వాత కూడా వర్షం పడితే ఎలా అని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్ కు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ఈరోజు మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? లేదా? అన్న టెన్షన్ రెండు జట్ల అభిమానుల్లో ఉంది. రెండు జట్లు ప్లే ఆఫ్ కోసం ప్రయత్నిస్తుండటంతో ఈ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Next Story

