Fri Dec 05 2025 18:40:53 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే
ఈరోజు ఢిల్లీ కాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం

ఐపీఎల్ సీజన్ చివరిదశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్ కు ఎవరు చేరుకుంటారన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కోల్కత్తా నైట్ రైడర్స్ అధికారికంగా ప్లేఆఫ్ కు చేరుకుంది. మిగిలిన మూడు జట్లు ఏవన్నదే ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లు నిర్ణయించబోతున్నాయి. పాయింట్ల పట్టికలో కేకేఆర్ తర్వాత స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఇప్పటికే ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో మిగిలిన ప్లేఆఫ్ కు చేరుకునే మూడు జట్లు ఏవన్నచర్చ జరుగుతుంది
రెండు జట్లూ బలంగానే...
ఈరోజు ఢిల్లీ కాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకమే. రెండు జట్లు ప్లేఆఫ్ లో రేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్లేఆఫ్ లో ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు ఉంది. అందుకే ఈరోజు జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకమనే చెప్పాలి.అందుకోసమే రెండు జట్లు హోరా హోరీ తలపడనున్నాయి. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉండటంతో ఎవరిది గెలుపు అన్న అంచనాలు వేయడం కష్టంగానే ఉంది.
Next Story

