Thu Mar 19 2026 08:53:52 GMT+0530 (India Standard Time)
IPL 2024 : రెండు దిగ్గజాల ఢీ నేడు
నేడు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది

నేడు మరో ఇంక్రెడిబుల్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు నేడు తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటికే రెండు జట్లు సమఉజ్జీలుగా నిలుస్తున్నాయి. రెండు జట్లు మొదటి, రెండు స్థానాల్లో ఉండటంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుండటంతో ఈరోజు ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అందించనుంది.
సమ ఉజ్జీలు కావడంతో...
నేడు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్కత్తా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 730 గంటలకు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ లో ఆరు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో గెలిచి అగ్రస్థానంలో ఉంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్లు ఆడి నాలిగింటిలో గెలిచి ద్వితీయ స్థానంలో ఉంది. దీంతో రసవత్తర పోరు నేడు కోల్కత్తా వేదికగా జరగనుంది.
Next Story

