Sun Feb 01 2026 09:29:52 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు ఐపీఎల్లో మరో కీలక మ్యాచ్
నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది. లక్నో లో ఈ మ్యాచ్ రాత్రి 7.30 కు ప్రారంభం కానుంది.

ఐపీఎల్ లో నేడు మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ లో ముఖ్యమైన జట్లు ఓటమి పాలు అవుతుండగా పెద్దగా అంచనాలు లేని జట్లు దూసుకు వెళుతున్నాయి. అందుకే ఈ ఐపీఎల్ సీజన్ లో ఎవరు ఛాంపియన్ అన్నది చివర వరకూ చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రతి మ్యాచ్ ఆద్యంతం ఉద్విగ్న భరితంగానే సాగుతుంది. అభిమానులను అలరిస్తుంది.
రెండు జట్లు...
నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది. లక్నో లో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లను సరిపోల్చుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఢిల్లీ కాపిటల్స్ టీం పుంజుకుంటే మాత్రం మ్యాచ్ లో మజా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ లో విజేత ఎవరు అన్నది మాత్రం అంచనాలకు అందడం లేదు.
Next Story

