Mon Feb 02 2026 00:04:39 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఐపీఎల్ లో నేడు హై ఓల్టేజీ మ్యాచ్
సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ నేడు తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది

ఐపీఎల్ లో నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. అభిమానులను కనువిందు చేయనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
భారీ స్కోరు దిశగానే...
ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన ఇక్కడే మ్యాచ్ జరగడంతో ఈసారి స్కోరు ఎంత అన్న దానిపై చర్చ జరుగుతుంది. మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇప్పటికి మూడు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ లో గెలిచి తిరిగి తన సత్తా చాటాలని భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ను చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పటికే రెండు టీంలు హైదరాబాద్ చేరుకుని గత కొద్ది రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాయి.
Next Story

