Mon Mar 16 2026 04:24:13 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు చెన్నైకి కీలక మ్యాచ్
నేడు చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ లో తలపడనుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ను ఢీకొననుంది

ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరస ఓటములను దెబ్బతీస్తున్నాయి. గతంలో ఐదు సార్లు ఛాంపియన్ గా అవతరించిన చెన్నై ఈసారి సీజన్ లో మాత్రం గెలుపుల కన్నా ఓటములను ఇప్పటి వరకూ ఎక్కువగా మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలం అవుతుండటంతో చెన్నైకు విజయాలు దక్కడం లేదు. దీంతో చెన్నై అభిమానులు నిరాశలో ఉన్నారు.
కోల్కత్తా నైట్ రైడర్స్ తో...
నేడు చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక మ్యాచ్ లో తలపడనుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ ను ఢీకొననుంది. చెన్నైలో ఈ మ్యాచ్ రాత్రి 730 గంటలకు జరగనుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ వరస విజయాలతో ఊపు మీదుండగా, చెన్నై మాత్రం ఆపసోపాలు పడుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్న దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
Next Story

