Thu Mar 19 2026 18:07:39 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేడు మరో జట్ల హోరా హోరీ పోరు
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు ముంబయి ఇండియన్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది.

ఐపీఎల్ లో మ్యాచ్ లు గతంలో ఏ సీజన్ లో జరగని విధంగా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. చివరి బంతు వరకూ విజయం దోబూచులాడుతూ క్రికెట్ ఫ్యాన్స్ ను కుర్చీల్లో కూర్చోనివ్వకుండా చేస్తుంది. ఈ సమయంలో ఏ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంటుందన్న అంచనాలు ఇప్పటికే దాదాపు వచ్చినా ప్లే ఆఫ్ చేరేందుకు అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. అన్ని జట్లు తమ శక్తి వంచన లేకుండా మైదానంలో చివరి బంతి వరకూ పోరాడుతుండటంతో ఎవరిది గెలుపు అన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది.
కసి మీద ఉన్న...
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు ముంబయి ఇండియన్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబయి ఇండియన్స్ వరస పరాజయాలతో కొంత ఇబ్బంది పడుతుండగా, కోల్్కత్తా నైట్ రైడర్స్ మాత్రం విజయాలను అందుకుంటూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయితే పరువు కోల్పోకుండా ఉండేలా ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలిచి కసి తీర్చుకోవాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది గెలుపు అన్నది మాత్రం ముందుగా అంచనా వేయలేని పరిస్థిితి.
Next Story

