Thu Dec 18 2025 07:37:12 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : సన్ రైజర్స్ కు నేడు కీలకమే
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

ఐపీఎల్ సీజన్ లో చివరి దశలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్లు పంజుకుని చివరి సమయంలో గెలుస్తున్నాయి. ఇది వరసగా గెలుస్తూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన జట్లకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకూ గెలిచింది ఒకటి అయితే.. ఇక జరగబోయే మ్యాచ్ లను గెలవడం మరొక ఎత్తుగా మారింది. అందుకే చిన్న జట్లు అని చూడకుండా ఆడాల్సి ఉండాలన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్లే ఆఫ్ రేసులో కి వచ్చామని ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా అందుకు మూల్యం చెప్పక తప్పేలా కనిపించడం లేదు.
నేడు మరో కీలక మ్యాచ్...
ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. హైదరాబాద్ లో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులను వదులుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హతలున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే దాని అవకాశాలు మరింత పెరుగుతాయి. అయితే ఇది ఐపీఎల్ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమన్న అంచనాలు వినపడుతున్నాయి.
Next Story

