Mon Dec 15 2025 20:24:04 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : నేడు మరో ఉత్కంఠ పోరు
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ నేడు తలపడనుంది.

ఐపీఎల్ లో నేడు మరో ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అంచనా వేసుకున్న జట్లు ఏవీ ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. పెద్ద జట్లు అనుకున్నవి కూడా మైదానంలో పెద్దగా ప్రదర్శన చేయలేకపోతుండటంతో చిన్న జట్లు దూసుకుపోతున్నాయి. నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ నేడు తలపడనుంది.
రెండు జట్లు...
గుజరాత్ టైటాన్స్ ప్రారంభంలో కొంత విజయాలను నమోదు చేసుకుని దూసుకువస్తుందని ఆశించినా తర్వాత వరస అపజయాలతో అది పాయింట్ల పట్టికలో వెనక్కు వెళ్లింది. అదే సమయంలో ఆరంభంలో ఢిల్లీ కాపిటల్స్ మెరుగైన ప్రదర్శన చూపించకపోవడం, ఓటములను చవిచూసినా.. తేరుకుని విజయాలను అందుకుంటుంది. ఇరుజట్లు బలాబలాలను పరిశీలిస్తే సమానంగా ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే అవకాశముంది.
Next Story

