Fri Mar 20 2026 03:28:32 GMT+0530 (India Standard Time)
IPL 2024 : నేటి ఐపీఎల్ మ్యాచ్ విశాఖలో
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ తో తలపడనుంది

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ తో తలపడనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరస విజయాలను నమోదు చేసుకుంటూ వస్తుంటే ఢిల్లీ కాపిటల్స్ వరస ఓటములను మూటగట్టు కుని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. విశాఖలో ఈ మ్యాచ్ జరగనుంది.
బ్యాటింగ్ పిచ్...
విశాఖ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. చెన్నై జట్టు బలంగా కనపడుతుండగా, ఢిల్లీ జట్టు ఓటములతో ఒకింత నీరసంతో కనిపిస్తుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో చెన్నైను ఓడించి ఐపీఎల్ లో సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story

