Tue Dec 16 2025 23:48:35 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎర్లీ ట్రెండ్స్ లో టీడీపీ కూటమిదే ఆధిక్యం.. వేవ్ ఇదే కొనసాగితే అధికారం దిశగా సైకిల్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ పార్టీ దూసుకుపోతుంది. అన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ పార్టీ దూసుకుపోతుంది. అక్కడా ఇక్కడా అని లేకుండా రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో 30 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ, కోస్తాంధ్రలలో ఎక్కడా వైసీపీ ఆధికానికి నోచుకోలేదు. కేవలం ఒకే ఒక్క స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. అయితే ఈసారి ఎర్లీ ట్రెండ్స్ అన్నీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
అన్ని చోట్ల...
జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్ వంటి వారు మాత్రమే కాకుండా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సయితం వైసీపీ ఎలాంటి ఆధిక్యత కనపర్చకపోవడం విశేషం. అంటే గంపగుత్తగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని భావించాలి. ఇదే ట్రెండ్ కొనసాగితే కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.
Next Story

