Fri Dec 05 2025 13:42:36 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : ఆంధ్రప్రదేశ్ లో ఆఖరి ఫలితం అక్కడేనట
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం ఎనిమిదన్నర గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే పది నుంచి పదకొండు గంటలకల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలిసిపోనుంది. ఇప్పటికే కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో...
అయితే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం ఫలితం మాత్రం చివరిలో వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అంతేకాదు ఎక్కువ రౌండ్లు కూడా ఇక్కడే జరగనున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 397 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా, 2,51,788 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 29 రౌండ్లలో అధికారులు లెక్కించనున్నారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
Next Story

