వరల్డ్ బ్లడ్ డోనర్ డే.. రక్తదానం చేస్తే కలిగే ఉపయోగాలేంటో తెలుసా?
ప్రతి సంవత్సరం జూన్ 14న, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకోనున్నారు
స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారిని గౌరవించడం, అవసరమైన వారికి సకాలంలో రక్తం చేరేందుకు అవకాశం కలిపించడం గురించి అవగాహన పెంచడం ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం
రక్తదానం ప్రాధమిక లక్ష్యం ప్రాణాలను కాపాడటం అయితే, రక్తం ఇవ్వడం వల్ల దాతకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు
రక్తదానం చేస్తూ ఉంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందనే విషయం చాలా మంది తెలుసుకోవాలి. రెగ్యులర్ గా రక్తదానం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రక్తదానం చేయడం వల్ల మీ రక్తంలో స్నిగ్ధత(viscosity) తగ్గుతుంది, ఇది గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తదానం చేయడం ద్వారా మీ గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది
రక్తంలో అధికశాతంలో ఐరన్ ఉండడం.. హెమోక్రోమాటోసిస్ అని పిలవబడే పరిస్థితికి దారి తీస్తుంది. ఇది కాలేయం, గుండె వంటి అవయవాలకు హాని కలిగించవచ్చు
రెగ్యులర్ గా రక్తదానం చేయడం ఈ అదనపు ఇనుము నిల్వలను శరీరంలో తగ్గించడంలో సహాయపడుతుంది. వంశపారంపర్య హెమోక్రోమాటోసిస్ లేదా ఐరన్ ఓవర్‌లోడ్‌కు దారితీసే ఇతర పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు రక్తదానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది
మీరు రక్తదానం చేసినప్పుడు, మీ శరీరం కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడానికి పని చేస్తుంది. ఈ ప్రక్రియ కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మీ రక్త కణాలను ఆరోగ్యంగా, క్రియాత్మకంగా ఉంచుతుంది
రక్తదానం చేయడం అనేది శారీరకంగా మేలు చేయడం మాత్రమే కాకుండా మానసికంగా ఎంతో హాయిని అందిస్తుంది. మీరు ఇచ్చే రక్తం ప్రాణాలను కాపాడుతుందని సహాయపడుతుందని తెలుసుకోండి. కాబట్టి, అవకాశం ఉన్నప్పుడల్లా రక్తదానం చేస్తూ ముందుకు వెళ్ళండి