శీతాకాలం వచ్చిందంటే చాలు దుప్పట్లో దూరిపోతూ ఉంటాం. చల్లని రాత్రులు, పొగమంచుతో కూడిన ఉదయాలు కొందరికి తెగ నచ్చేస్తూ ఉంటాయి
అదే సమయంలో చలికాలంలో మన చర్మానికి కూడా అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. చల్లని, పొడి గాలి కారణంగా చర్మం పొడిబారిపోతూ ఉంటుంది
ఈ కాలంలో కొంత అదనపు జాగ్రత్త అవసరమే. చర్మ సంరక్షణ చాలా అవసరం. పొడిబారడం లేదా మొటిమలు వంటి అనేక చర్మ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి
మీరు మీ శరీరాన్ని పొడిగా ఉంచుకునేందుకు స్నానం చేసే సమయంలో ఉపయోగించే సబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి
చలికాలంలో మరీ వేడి నీటితో స్నానం చేస్తుంటారు కొందరు.. కాబట్టి వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేయండి
మాయిశ్చరైజేషన్ కారణంగా చర్మం మృదువుగా మారుతుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి. మీ శరీరాన్ని రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజ్ చేయాలి
టాన్ సమస్యలు ఉంటాయని భావిస్తే గ్లైకోలిక్ యాసిడ్ ఆధారిత లోషన్‌ను కూడా వాడవచ్చు. మోటిమలు, పిగ్మెంటేషన్ సమస్యలు ఉన్నవాళ్లు శరీరంపై గ్లైకోలిక్ యాసిడ్ లోషన్లను ఉపయోగించవచ్చు
సన్‌స్క్రీన్‌ని కూడా ఉపయోగించండి. ఎక్కువ ఎండలో ఉండాల్సిన సమయంలో సన్‌స్క్రీన్ ను తప్పనిసరిగా వాడండి.
మన పాదాలపై చాలా డెడ్ సెల్ ఫార్మేషన్ ఉంటుంది. మీరు గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, యూరియా కలిగి ఉన్న మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. లాక్టిక్ యాసిడ్, యూరియా మీ చర్మాన్ని చాలా మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి