చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ మాత్రమే కాదు.. విజయానికి ప్రతీక దీపావళి

నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు
ఈ ఏడాది దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు
అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చాయి. దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది
ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం
అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు
నవంబర్‌13న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది. ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చు
12వ తారీఖు ఉదయం నరకచతుర్దశికి సంబంధించినటువంటి స్నాన, దాన, తర్పణ, పితృ కర్మలు వంటివి ఆచరించుకొని 12వ తారీఖు రాత్రి అమావాస్య సమయంలో లక్ష్మీదేవిని పూజించుకుని దీపావళి పండుగను జరుపుకోవాలి
13వ తారీఖు సోమవార వ్రతం, కేదార గౌరీవ్రతం వంటివి ఆచరించుకోవాలి. 14వ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది