నటి రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్​ఫేక్​ వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది

అమితాబ్​ బచ్చన్​తో పాటు ఎందరో ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు
అసలు ఈ డీప్​ఫేక్​ వీడియో అంటే ఏమిటి అనే విషయం చాలా మందికి తెలీదు.. ఇది ఎంతో ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది
డీప్​ఫేక్ ద్వారా ఒక వీడియోలోని అసలు వ్యక్తి ముఖాన్ని, శరీరాన్ని, ఆల్గోరిథమ్​ల సహాయంతో మార్ఫ్​ చేయవచ్చు. సెలబ్రెటీలు, ప్రముఖులు.. ఈ డీప్​ఫేక్​ వీడియో బారిన పడుతున్నారు
డీప్​ఫేక్ కోసం వాడిన ఆల్గోరిథమ్​ల​ కారణంగా వీడియో చాలా ఆథెంటిక్​గా, నిజంగా కనిపిస్తుంది. డీప్​ లర్నింగ్​ అనే ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ని వాడుకుని ఫొటోలు, వీడియోలను మార్ఫ్​ చేస్తూ ఉంటారు
ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ టూల్స్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ డీప్​ఫేక్​ వ్యవహారం చాలా సమస్యగా మారింది
డీప్​ఫేక్​ వీడియోలు దాదాపు నిజంగానే అనిపిస్తాయి. వీడియోలోని కొన్ని విషయాలను నిశితంగా పరిశీలించి.. ఆ తర్వాత అది నిజమో, కాదో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది
మనిషికి, వెనుక ఉన్న బ్యాక్​గ్రౌండ్​కి మధ్య కలర్​, బ్రైట్​నెస్​ వంటివి మ్యాచ్​ అవ్వకపోతే అది ఫేక్​గా భావించొచ్చు. ఆడియో క్వాలిటీని కూడా చూడాలి. లిప్​ సింక్​ అవ్వకపోతే దానిని డీప్​ఫేక్​ వీడియోగా భావించవచ్చు
డీప్​ఫేక్​ డిటెక్షన్​ టూల్స్​ వంటివి వాడి.. వీడియో ఒరిజినాలిటీని తెలుసుకోవచ్చు. అనేక డిటెక్షన్​ టూల్స్ కూడా​ అందుబాటులోకి వస్తున్నాయి