జపనీస్ కళాకారుడు షిగెటకా కురిటా 1999లో జపనీస్ మొబైల్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్‌లో భాగంగా 176 ఎమోజీల కలెక్షన్స్ ను రూపొందించారు
ఈ సెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఎమోజీల సెట్‌గా కొనసాగింది
2014లో ఎమోజీపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్.. ఎమోజీల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో వేడుకల రోజును ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే ఏటా జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు
2015లో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ “ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్” ఎమోజీకి “వర్డ్ ఆఫ్ ది ఇయర్” అని పేరు పెట్టింది. ఫింగర్ హార్ట్ ఎమోజి కె-పాప్, కె-డ్రామాల కారణంగా ప్రజాదరణ పొందింది
2022లో ‘క్రాస్ వరల్డ్ సాల్వర్’ అనే సంస్థ సర్వే చేసి.. మన దేశంలో ఎక్కువ మంది ఉపయోగించే ఎమోజీలు ఏవనేది తేల్చింది
నవ్వలేక కన్నీళ్లు వచ్చే ఎమోజీ.. రెండు చేతులతో దండం పెడుతున్న ఎమోజీ.. ఏడుస్తున్న ఎమోజీ.. ప్రాధేయపడుతున్నట్లుగా ఉండే ఎమోజీ.. థమ్స్ అప్ ఎమోజీ.. ఈ ఐదింటినీ మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారని తేలింది
ఒక్కో ఎమోజీ.. ఒక్కో విషయానికి ఉపయోగిస్తూ ఉంటారు. పదాలతో చెప్పే బదులు.. ఎమోజీ ద్వారా చాలా విషయాలను వెల్లడించవచ్చు
పలువురు ప్రముఖులు, సెలెబ్రిటీలు కూడా ఎక్కువగా ఎమోజీలను ఉపయోగిస్తూ ఉంటారు
1999 మరియు 2023 మధ్య, ఎమోజీల సంఖ్య 176 నుండి 3491కి పెరిగింది. 92% మిలీనియల్స్ వారి రోజువారీ సంభాషణలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నారు. గత 3 సంవత్సరాలలో ఎమోజీల వినియోగంలో 775% పెరుగుదల కనిపించింది
హార్ట్ సింబల్, ఎగ్ ప్లాంట్, లవ్ సింబల్.. లాంటి ఎన్నో ఎమోజీలకు బాగా పాపులారిటీ వచ్చాయి